TG: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టిన తరువాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారుల బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.

TG: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టిన తరువాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారుల బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1,072 మంది లబ్ధిదారులకు రూ.12.17 కోట్ల బిల్లులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎల్-3 కేటగిరీలోని లబ్ధిదారుల బిల్లుల చెల్లింపు అంశాన్ని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బిల్లు చెల్లింపుల ప్రక్రియలో నిశిత పరిశీలనలో లబ్ధిదారులు ఆర్సీసీ అద్దె ఇండ్లలో నివస్తుండటం, గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిపొంది ఉండటం తదితర కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు. ఈ అంశాన్ని పరిశీలించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో సొంతింటి వసతి లేక ఆర్సీసీ ఇండ్లలో అద్దెకు ఉంటూ ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితోపాటు పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్ పనుల వరకే లబ్ధి పొందిన వారికి బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కేటగిరీలో అర్హులైన వారికి బిల్లులను విడుదల చేసినట్లు ఎండీ తెలిపారు.

Next Story