ఓటరు జాబితా శుద్ధీకరణలో బీహార్ సరికొత్త రికార్డు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

by Malleboina Mahesh |

ఇటీవల ఎన్నికలు జరిగిన బీహార్ రాష్ట్రం.. ఓటర్ల జాబితా శుద్ధీకరణలో సరికొత్త రికార్డు సృష్టించిందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఓటరు జాబితా శుద్ధీకరణలో బీహార్ సరికొత్త రికార్డు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఎన్నికలు జరిగిన బీహార్ రాష్ట్రం.. ఓటర్ల జాబితా శుద్ధీకరణలో సరికొత్త రికార్డు సృష్టించిందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ రోజు ఢిల్లీ వేదికగా జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా.. భారత ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితా (Electoral Rolls) పునాది వంటిదని, బిహార్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈ జాబితా శుద్ధీకరణ అద్భుతంగా జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కొనియాడారు.

బిహార్‌లో మొత్తం 7.5 కోట్ల మంది ఓటర్లు ఉండగా, బూత్ స్థాయి అధికారులు (BLOలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు అత్యంత పారదర్శకంగా జాబితాను రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా, బిహార్ ప్రజల నిశిత పరిశీలనలో ఈ ప్రక్రియ జరిగినప్పటికీ, ఓటర్ల జాబితా ఖరారైన తర్వాత దానికి సంబంధించి ఒక్క అప్పీల్ (Zero Appeals) కూడా రాకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు 'బీఎల్ఓ'లు భారత ఎన్నికల వ్యవస్థలో బూత్ స్థాయి అధికారులు (BLOs) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి పోలింగ్ బూత్‌లో సగటున 970 మంది ఓటర్లు ఉంటారని, అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడంలో బీఎల్ఓలదే ప్రధాన బాధ్యత అని చెప్పారు. వారిని భారత ఎన్నికల ప్రజాస్వామ్యానికి 'మూలస్తంభాలు' (Foundational Pillars) గా అభివర్ణించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించే బీఎల్ఓలకు కొత్త గుర్తింపు కార్డులను జారీ చేశామని, దీనివల్ల వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ విధులను నిర్వహించవచ్చని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story