- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rathika: బిగ్‌బాస్ రతిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!1
తెలుగు బిగ్‌బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ (Bigg Boss) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుని.. ప్రస్తుతం ఎనిమిదో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్(Rathika Rose) తన అందచందాలతో, ఆటతీరుతో బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని అలరించింది. ఈ షో తో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ కెరీర్‌లో దూసుకుపోతుంది. ఈ ఫేమ్‌తో సినిమాల్లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. రతిక 2020 లో షకలక శంకర్(Shakalaka Shankar) నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో కనిపించింది. తర్వాత నేను స్టూడెంట్ సర్(Nēnu sṭūḍeṇṭ sar) సినిమాలో లేడీ ఆఫీసర్‌గా నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’(Bhagwant Kesari)లో ఓ పాత్ర పోషించింది. నారప్ప(Narappa), అశోక వనంలో అర్జున కళ్యాణం (Arjuna's wedding in Ashoka forest)లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో రతికా రోజ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో ప్రేమాయణం నడిపించిందని నెట్టింట జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచే వారిలో రతిక ఒకరని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వేదికన పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘ఈ ప్రపంచం చాలా కఠినమైనది. దాన్ని మరింత కఠినంగా మార్చవద్దు. ప్రేమను, ఆనందాన్ని పంచుకుందాం’ అని రాసుకొచ్చింది. దీంతోపాటు బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు.. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.






