సిగరెట్ పెట్టిన చిచ్చు. ఘోరంగా ఏడ్చిన హాట్ బ్యూటీ

by Disha Web |
సిగరెట్ పెట్టిన చిచ్చు. ఘోరంగా ఏడ్చిన హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: తెలుగు 'బిగ్‌బాస్‌' షో ప్రస్తుతం ఓటీటీలో ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. కాగా కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి రోజే గొడవలతో మొదలైన ఈ షోలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ డ్రామా జరిగింది. ఈ మేరకు ఓ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలనుకుంటారు? ఎవరి ముఖం చూడొద్దనుకుంటారో చెప్పాలన్నాడు.

దీంతో పొద్దున లేవగానే బిగ్‌బాస్‌తో గొడవ పడే ముమైత్‌ ఖాన్‌ ముఖం చూడకూడదని అనుకుంటున్నట్లు తెలిపిన చైతూ ఓ బ్యాడ్ ఎమోజీ ఉన్న బ్యాడ్జ్‌ పెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఏడుపందుకున్న ముమైత్.. నాన్సెన్స్‌ నన్ను టార్గెట్‌ చేస్తున్నాడంటూ ఫైర్‌ అయింది. దీంతో మరోసారి రెచ్చిపోయిన చైతూ.. ముమైత్‌ పొద్దుపొద్దునే సిగరెట్ల కోసం ఏడుస్తుంది. అలా పొద్దున ఏడవకూడదని చెప్పాను. అది తప్పా? అంటూ ఫ్రస్టేట్‌ అయ్యాడు. దీంతో స్మోకింగ్‌ రూమ్‌లోకి వెళ్లిన ముమైత్ దమ్ము లాగుతూ బిగ్గరగా ఏడుస్తుండటంతో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా మొదటి కెప్టెన్‌గా గెలిచిన తేజస్వి, అషూరెడ్డి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.



Next Story