మున్సిపల్ ఎన్నికల బిగ్ అప్డేట్.. రిజర్వేషన్లు ఖరారు

by Muthe.Rajitha |

త్వరలో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వెలువడింది.

మున్సిపల్ ఎన్నికల బిగ్ అప్డేట్.. రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వెలువడింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో జనరల్ కేటగిరిలో 30, జనరల్ మహిళలకు 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళలకు 19, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళకు 8, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. ఇక రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళలకు 3, బీసీ జనరల్ , బీసీ మహిళ 1, ఎస్సీ, ఎస్టీలకు చెరొకటి చొప్పున స్థానాలు కేటాయించింది. కాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 17 లోపు నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం.

Next Story