లుంగి ఎంగిడి పరిస్థితిపై బిగ్ అప్‌డేట్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-25 17:47:53  IST  )

బిగ్ అప్‌డేట్: లుంగి ఎంగిడి క్షేమం! పరీక్షల అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్. తల, మెడ నొప్పి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ టీమ్.

లుంగి ఎంగిడి పరిస్థితిపై బిగ్ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లొ భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 35వ మ్యాచ్‌లో క్యాచ్ పట్టబోయి ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగి ఎంగిడి (Lungi Engidi) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటిన అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై ఊరటనిచ్చే వార్త వెలువడింది. మైదానంలో తల, మెడకు బలమైన గాయం కావడంతో ఆందోళన చెందిన అభిమానులకు, ఢిల్లీ మేనేజ్‌మెంట్ లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ అందించింది. ప్రస్తుతం ఎంగిడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, అతను మరికొద్ది సేపట్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు ఢిల్లీ యాజమాన్యం (Ownership of Delhi) ప్రకటించింది.

ఆస్పత్రిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు, స్కాన్ రిపోర్టులో ఎంగిడికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, అంతర్గత గాయాలు ఏమీ లేవని వైద్యులు ధ్రువీకరించారు. తలనొప్పి, మెడ నొప్పి తగ్గడం తో అతన్ని డిశ్చార్జ్ చేయనున్నారు. అయితే, తలకు తగిలిన గాయం (Concussion) దృష్ట్యా, అతను బీసీసీఐ కంకషన్ నిబంధనల ప్రకారం కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ మ్యాచులో ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, పంజాబ్ కింగ్స్ 265 పరుగులు చేసి రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ తరుఫున కీ బౌలర్ కావడంతో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది.

Read more...వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. 36 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ

Next Story