Madhavan: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-09 11:45:35  IST  )

గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

Madhavan: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతే మరికొందరు మాత్రం అనుకోకుండా యాక్సిడెంట్‌లో మరణిస్తున్నారు. తాజాగా, ఇండస్ట్రీ(Mollywood Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్(TP Madhavan) కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొల్లంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. కాగా, మాధవన్ ఏకంగా 600 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా పలు సీరియల్స్‌లోనూ నటించినట్లు సమాచారం. అయితే మాధవన్ చివరి సారిగా ‘మాల్గుడి’ మూవీ(Malgudi Movie)లో నటించారు. ఈ చిత్రం 2016లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలను దూరం అయినట్లు సమాచారం. అనుకోకుండా నేడు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Next Story