- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్: 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు!
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. మేజిస్ట్రేట్ ఉత్తర్వులతో చంచల్‌గూడ జైలుకు తరలింపు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Former MLA Pilot Rohit Reddy)కి షాక్ తగిలింది. హెల్త్ చెకప్ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ (Magistrate) ముందు హాజరుపరచగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో పాటు, పార్టీలో డ్రగ్స్ లభ్యత (Drug availability)పై పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు రితేష్‌రెడ్డి, నిమిద్‌కు కూడా రిమాండ్ విదించారు. పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు వారు బెయిల్ పిటిషన్ వేయగా.. మెజిస్ట్రేట్ తిరస్కరించారు.
ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఇతర కీలక వ్యక్తులు కూడా నిందితులుగా ఉండటం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ పార్టీ నిర్వహణలో రోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిమాండ్ విధించడంతో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకప్పుడు 'ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడిగా సంచలనం సృష్టించిన రోహిత్ రెడ్డి, ఇప్పుడు డ్రగ్స్ కేసులో జైలు పాలు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.






