- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌కు బిగ్ షాక్.. యుద్ధంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ..?
పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రం! ఇరాన్‌కు వ్యతిరేకంగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.. భారతీయుల భద్రతపై ఆందోళన. చమురు ధరల పెరుగుదల

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంటరిగా పోరాడుతున్న ఇరాన్ కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్‌కు యూరోపియన్ దేశాలు రంగంలోకి దిగి.. ఇరాన్‌కు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రత్యక్షంగా సపోర్టుగా నిలిచాయి. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల అనంతరం, ఇప్పుడు బ్రిటన్ (UK), ఫ్రాన్స్- జర్మనీలు కూడా ఈ వివాదం లోకి చేరాయి. తాము ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నప్పటికీ, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి తమ ప్రయోజనాలను మిత్రదేశాలను కాపాడుకోవడానికి "రక్షణ చర్యలు" (Defensive Action) చేపట్టేందుకు సిద్ధమని ఈ మూడు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, అమెరికా రక్షణ దాడుల కోసం బ్రిటన్ సైనిక స్థావరాలను వాడుకోవడానికి అనుమతించినట్లు స్పష్టం చేశారు.
ఉమ్మడి రక్షణ చర్యలు - క్షేత్రస్థాయి పరిస్థితులు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన ఎదురు దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా గల్ఫ్ గగనతలంలో ఇప్పటికే ఈ దేశాల యుద్ధ విమానాలు నిఘా పెంచాయి. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే అడ్డుకునేందుకు ఈ దేశాలు సైనిక సహకారాన్ని అందిస్తున్నాయి. మరోవైపు, ఇరాన్ దాడుల వల్ల జోర్డాన్‌లోని జర్మనీ సైనిక శిబిరం సమీపంలో పేలుళ్లు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికాకు తోడుగా యూరోపియన్ దేశాలు కూడా రంగంలోకి దిగడంతో, ఈ సంక్షోభం ప్రాంతీయ యుద్ధం స్థాయిని దాటి గ్లోబల్ వైడ్ ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది.
శాంతి కోసం అంతర్జాతీయ ప్రయత్నాలు..
ఒకవైపు సైనిక చర్యలు జరుగుతున్నా, మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వంటి నేతలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రదేశాల ప్రమేయం పెరగడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి మరియు గల్ఫ్ ప్రాంతంలో విమానయాన రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. లక్షలాది మంది ప్రవాసులు, ముఖ్యంగా భారతీయుల భద్రత ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాలుగా మారింది.






