- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హెజ్‌బొల్లా’ స్థావరాలే టార్గెట్.. బాంబుల మోతతో దద్దరిల్లుతున్న బీరుట్
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్, బీరూట్‌లపై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు జరిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khamenei) మరణం తర్వాత మొదలైన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ (Operation Roaring Lion) పేరుతో విరుచుకుపడుతుండగా, మరోవైపు లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లాతో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా, ఇజ్రాయెల్ వాయుసేనలు రెండో రోజు కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడ్డాయి. ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. రాజధాని నగరంలోని ప్రభుత్వ భవనాలు బాంబుల తాకిడికి ధ్వంసమయ్యాయి.
లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, డ్రోన్లతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. లెబనాన్ రాజధాని బీరూట్ (Beirut)పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ లెబనాన్, బీరూట్‌లో సుమారు 50 గ్రామాలు, పట్టణాల ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో ఉత్తర దిశగా వలస వెళ్తున్నారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడి
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన క్షిపణులను గల్ఫ్ దేశాల వైపు మళ్లించింది. దుబాయ్, అబుదాబి, దోహా మరియు కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. దుబాయ్‌లోని ఒక ప్రముఖ హోటల్‌పై దాడి జరిగినట్లు వార్తలు రావడంతో యూఏఈ (UAE) ప్రభుత్వం తన పౌరులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.






