గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌‌కు బిగ్ షాక్.. తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు

by Kema Shiva Kumar |

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ ఆరోపణలతో ఉగ్రవాదిగా గుర్తించబడిన 2024లో గోల్డీ బ్రార్ అలియాస్ సతీందర్‌జీత్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది.

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌‌కు బిగ్ షాక్.. తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య కేసులో ప్రధాన నిందితుడు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ ఆరోపణలతో ఉగ్రవాదిగా గుర్తించబడిన 2024లో గోల్డీ బ్రార్ (Goldie Brar) అలియాస్ సతీందర్‌జీత్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ముక్త్‌సర్‌లోని ఆదేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆయన తండ్రి తండ్రి షంషేర్ సింగ్ (Shamsher Singh), తల్లి ప్రీత్‌పాల్ కౌర్‌ (Preetpal Kaur)లను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

2024లో ముక్త్‌సర్ జిల్లాకు చెందిన ఒక స్థానిక నివాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన దోపిడీ (Extortion) కేసు దర్యాప్తులో భాగంగా వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌ను దెబ్బతీయడంలో భాగంగా, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులు, అనుచరులపై పంజాబ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. కాగా, గతంలో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న గోల్డీ బ్రార్, గతేడాది ఆ ముఠా నుంచి విడిపోయి సొంతంగా నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు.

Next Story