- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ ఊరట.. మే 1 నుంచి మిచెల్ స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మిచెల్ స్టార్క్ ఎంట్రీ! మే 1 నుండి అందుబాటులో ఉంటారని కెప్టెన్ అక్షర్ పటేల్ వెల్లడి. స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్ బలోపేతం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఆరంభంలో మంచిగా విజయాలను అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. వరుస ఓటములతో సతమతమవుతుంది. ఆ జట్టు స్టార్ బౌలర్లు గాయాలతో దూరం కావడంతో భారీ స్కోర్ ను కూడా కాపడుకోలే చేతులెత్తేస్తుంది. ఈ క్రమంలో ఆ జట్టు అభిమానులకు భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) జట్టులో చేరారని, మే 1 నుంచి ఆయన ఎంపికకు అందుబాటులో ఉంటారని కెప్టెన్ అక్షర్ పటేల్ ధృవీకరించారు. సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం అక్షర్ మాట్లాడుతూ.. స్టార్క్ రాకతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరిలో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్క్, ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించి జట్టుతో కలిశారని, ఆయన వర్క్‌లోడ్‌ను పర్యవేక్షిస్తూ తుది జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 75 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా, ఆర్‌సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో ఏడో స్థానానికి పడిపోయిన ఢిల్లీ జట్టుకు, స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ రాక రాబోయే మ్యాచ్‌ల్లో కీలకంగా మారనుంది.






