విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ఈఏపీ సెట్, ఈసెట్, ఐసెట్ దరఖాస్తుల గడువు ఇదే!

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న విధ్యార్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ఈఏపీ సెట్, ఈసెట్, ఐసెట్ దరఖాస్తుల గడువు ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న విధ్యార్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు.. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7 చివరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోతే, రూ. 1,000 నుంచి రూ. 10,000 వరకు అపరాధ రుసుముతో మార్చి 26 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మార్చి 26 నుంచి 28 వరకు గడువు ఇచ్చారు.

ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్: ఈఏపీసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ 28న డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14, 15 మరియు 18 తేదీల్లో నిర్వహించనుండగా, వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరగనున్నాయి. మే 23న ప్రాథమిక 'కీ' విడుదల చేసి, మే 25 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జూన్ 1న ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈసెట్ (ECET) వివరాలు: డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ కోసం రాసే ఈసెట్ దరఖాస్తులకు మార్చి 2 ఆఖరి తేదీ. అపరాధ రుసుముతో మార్చి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23న జరుగుతుంది. ఏప్రిల్ 27న ప్రాథమిక 'కీ' విడుదల చేసి, మే 7న తుది ఫలితాలను ప్రకటిస్తారు.

ఐసెట్ (ICET) అప్‌డేట్స్: MBA, MCA కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఐసెట్ కోసం మార్చి 2 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుముతో మార్చి 21 వరకు సమయం ఉంది. ప్రవేశ పరీక్షను మే 2న నిర్వహించి, మే 5న ప్రాథమిక 'కీ' విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మే 16న ఫలితాలను వెల్లడిస్తారు. అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Next Story