విద్యార్థులకు బిగ్ అలర్ట్.. TG EAPCET, PGECET-2026 షెడ్యూల్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-30 07:47:07  IST  )

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET-2026 షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. TG EAPCET, PGECET-2026 షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET-2026 షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఇవాళ జేఎన్‌టీయుహెచ్ (JNTUH)లో జరిగిన మొదటి సీఈటీ (CET) కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. TG EAPCET అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 14 విడుదల కానుంది. ఫిబ్రవరి 19 నుంచి విద్యార్థల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4ను ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు స్వీకరించేందుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు మే 4, 5, తేదీల్లో, ఇంజనీరింగ్ విద్యార్థలను మే 9 నుంచి మే 11 పరీక్షలను ఆన్‌లైన్ విధనంలో నిర్వహించనున్నారు.

PGECET షెడ్యూల్ ఇలా..

రాష్ట్రంలోని ఎం.టెక్ (M.Tech), ఎం.ఫార్మసీ (M.Pharmacy), ఎం.ఆర్క్ (M.Arch) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG PGECET-2026 షెడ్యూల్‌ కూడా విడుదలైంది. పరీక్షకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే6ను ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు స్వీకరించేందుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇక మే 28 నుంచి మే 31 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Next Story