గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజే నియామక పత్రాల పంపిణీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-13 16:18:36  IST  )

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజే నియామక పత్రాల పంపిణీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గ్రూప్-3 (Group-III) సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16న నియామక పత్రాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాదాపూర్‌ (Madhapur)లోని శిల్పకళా వేదిక (Shilpakala Vedika)లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయన స్వయంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లను అందజేసి, వారిని విధుల్లోకి ఆహ్వానించనున్నారు.

కాగా, టీజీపీఎస్సీ (TGPSC) ఇటీవల 1,388 గ్రూప్-3 పోస్టులకు గాను 1,370 మంది అభ్యర్థులతో కూడిన తుది ఎంపిక జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, అత్యంత వేగంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో గ్రూప్-1, గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ తరహాలోనే, ఈసారి కూడా అభ్యర్థుల తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులను ఈ వేడుకకు అనుమతించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story