చలకుర్తిలో 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్‌కు భూమి పూజ

by Batti.Sumithra |

పెద్దవూర మండలం చలకుర్తి గ్రామపంచాయతీ పరిధిలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేశారు స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి.

చలకుర్తిలో 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్‌కు భూమి పూజ
X

దిశ, పెద్దవూర : పెద్దవూర మండలం చలకుర్తి గ్రామపంచాయతీ పరిధిలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేశారు స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. ఈ సబ్ స్టేషన్ పరిధిలో చలకుర్తి, కుంకుడు చెట్టు తండా, బోనూతల, పులగూడెం గ్రామాలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనున్నది. రైతులు, గృహ వినియోగదారులకు విద్యుత్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్ణాటక లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు,విద్యుత్ అధికారులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story