- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణిలో అడ్డగోలుగా మెడికల్ ఇన్వాలిడేషన్లు : భట్టి విక్రమార్క
గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో అడ్డగోలుగా మెడికల్ ఇన్వాలిడేషన్లు జరిగాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మెడికల్ ఇన్వాలిడేషన్ల కారణంగా సింగరేణి సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో జరిగిన అసాధారణ మెడికల్ ఇన్వాలిడేషన్లపై ప్రస్తుతం ఏసీబీ, విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. 2000 నుండి 2014 మధ్య 14 ఏళ్ల కాలంలో జరిగిన ఇన్వాలిడేషన్లు కేవలం 3,859 మాత్రమేని, 2014 నుండి 2023 మధ్య 9 ఏళ్లలోనే 13,119 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారని తెలిపారు. ఈ సంక్షోభాన్ని అరికట్టేందుకు కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్ నిబంధనలను పరిశీలించి, పా, మైనింగ్ జీఎం, ఒక నామినేటెడ్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలను కఠినతరం చేస్తూనే, మానవీయ దృక్పథంతో కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.
సింగరేణి మనుగడ సాగించాలంటే ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 30 శాతం జెన్కోకు వెళ్తుంది. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు కొనడం వల్ల జెన్కోపై భారం పడుతోంది. అదే కోల్ ఇండియా నుంచి కొంటే యూనిట్‌కు రూ. 2, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి కొంటే రూ. 1.25 చొప్పున ఖర్చు తగ్గుతుంది. ఈ భారం చివరకు రాష్ట్రంలోని 3.55 కోట్ల ప్రజలపైనే పడుతోంది, అని డిప్యూటీ సీఎం వివరించారు. మారుతున్న ప్రపంచ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా సింగరేణిలో 'రేషనలైజేషన్' జరగాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి, జెన్కో రెండు ప్రభుత్వ సంస్థలేనని, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.






