- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: డిప్యూటీ సీఎం భట్టి
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పుదుచ్చేరిలో ప్రచారం నిర్వహించేందుకు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. పాండిచ్చేరి విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథంలు భట్టికి ఘనస్వాగతం పలికారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 23 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో భట్టి విక్రమార్క పాల్గొని అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఏప్రిల్‌లో ఎన్నికలు ఎదుర్కొనబోతున్నామని, ఏ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం, పాండిచ్చేరిని కాపాడుకోవాలని నినాదం తీసుకోవాలని, ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కూటమి ఉందని భట్టి అన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం, అద్భుతమైన రాజ్యాంగం తీసుకువచ్చిందని, కాంగ్రెస్ దేశంలో ప్రజాస్వామ్య పునాదిని వేయడంతో పాటు అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని ఆయన తెలిపారు.
కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన సభ్యులతో భట్టి విక్రమార్క శనివారం ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. కేరళలో కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ ప్రభుత్వంలో అన్నివర్గాలతో సమానంగా దివ్యాంగులకు అవకాశాలు లభిస్తాయని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని, వైకల్యం దురదృష్టకరమే అయినా.. వారిని సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చేసేందుకు మనమంతా పనిచేయాలని భట్టి విక్రమార్క సూచించారు.






