డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ కీలక ఒప్పందం!

by Disha Web Desk 17 |
డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ కీలక ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కీలకం ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. భారత్‌లో డిజిటల్ వ్యవస్థ వృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తూ ఆర్థిక పరిష్కారాల కోసం ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని ఇరు సంస్థలు వెల్లడించాయి. అంతేకాకుండా దేశంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు రానున్న నెలల్లో ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ కొత్త ఆఫర్లను, డిజిటల్ సేవలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. వీటిలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌తో పాటు ప్రీ-అప్రూవ్‌డ్ ఇన్‌స్టాండ్ లోన్, బౌ-నౌ-పే-లేటర్ ఆఫర్ సహా ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇరు సంస్థలకు దేశీయంగా ఉన్న విస్తరణ సామర్థ్యం ద్వారా డిజిటల్ చెల్లింపులను టైర్ 2, టైర్ 3 నగరాలకు మరింత వేగవంతంగా తీసుకెళ్లేందుకు సహాయపడుతుందని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యంలో ప్రత్యేక డిస్కౌంట్లు, డిజిటల్ వోచర్, ఎయిర్‌టెల్ వినియోగదారులకు కాంప్లిమెంటరీ సేవల వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించింది.


Next Story

Most Viewed