రేపు భారత్ బంద్

by Muthe.Rajitha |

రేపు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్(సార్వత్రిక సమ్మె) జరగనుంది.

రేపు భారత్ బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్(సార్వత్రిక సమ్మె) జరగనుంది. ప్రధానంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు అయిన CITU, AITUC, INTUC, HMS వంటి సంస్థలు మరియు రైతు సంఘాలు SKM, AIKS, BKU తదితరులు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. సుమారు 30 కోట్ల మంది ఈ బంద్‌లో పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలనే ఉద్దేశంతో ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ బంద్‌కు ముఖ్య కారణాల్లో ఒకటి.. కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌. ఈ కొత్త లేబర్ చట్టాలు కార్మికుల హక్కులను తొలగిస్తున్నాయని, ఉద్యోగ భద్రత తగ్గుతుందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.

అలాగే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ రైతులకు నష్టం కలుగుతుందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌పై ప్రభావం పడుతుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అదనంగా MSPకు చట్టబద్ధ హామీ, ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్ ఉపసంహరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకత, వేతనాల పెంపు వంటి డిమాండ్లు కూడా ఉన్నాయి.

బంద్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలైన రోడ్డు, రైలు రవాణా సర్వీసులు కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, కొన్ని మార్కెట్లు మూసివేయబడే అవకాశం ఉంది. స్కూళ్లు, కాలేజీలు అధికారికంగా సెలవు ప్రకటించకపోయినా.. బస్సులు నిలిచిపోతే అవి కూడా తెరుచుకోకపోవచ్చు. ఆసుపత్రులు, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయి. ప్రైవేట్ ఆఫీసులు, IT కంపెనీలు సాధారణంగానే పని చేసే అవకాశం ఉంది.

Next Story