Mahamuttaram SI:సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. ఆ వివరాలు చెబితే ప్రమాదంలో పడ్డట్లే!

by Jakkula.Mamatha |

మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి హానికరం అని మహా ముత్తారం ఎస్సై గోర్ల రమేష్ అన్నారు.

Mahamuttaram SI:సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. ఆ వివరాలు చెబితే ప్రమాదంలో పడ్డట్లే!
X

దిశ, మహాముత్తారం: మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి హానికరం అని మహాముత్తారం ఎస్సై గోర్ల రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో యువత మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి, కుటుంబానికి మరియు హానికరమని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలను విక్రయించిన లేదా ఎవరైనా వాడిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటీపీలు బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయరాదని సూచించారు.

తెలియని లింకులు, సందేశాలు క్యూ ఆర్ కోడ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. రోడ్డు భద్రతపై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలతో పాటు తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story