- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : ఎస్ఈ బిక్షపతి
by Batti.Sumithra |
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ బి.బిక్షపతి అన్నారు.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ బి.బిక్షపతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలు, బ్రేక్‌డౌన్ పరిస్థితులు, నిర్వహణ పనులు, దెబ్బతిన్న డీటీఆర్‌ల తరలింపు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అత్యవసర సేవలను మరింత వేగంగా అందించేందుకు ఈ వాహనం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ పి. నాగేశ్వరరావు, ఏడీఈ ఎన్. వేణుగోపాల్ కమర్షియల్ ఏఈ మహేందర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






