- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8000 బ్యాటరీ, రూ.20వేల లోపే ధర...అదిరిపోయే వన్ ప్లస్ ఫీచర్స్ ఇవే
రూ.20వేలలోపే వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్ లాంఛ్ కానుంది.

దిశ, వెబ్ డెస్క్: వన్ ప్లస్ మొబైల్స్ కు ఇండియన్ మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే ఈ కంపెనీ నుంచి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి వన్ ప్లస్ N6 (OnePlus N6) పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. జూన్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ అధికారికంగా విడుదల కానుంది. అయితే ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.18 వేల నుంచి రూ.25 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే..6.78 అంగుళాల డిస్ ప్లేతో రానున్న ఈ ఫోన్, 7400 MediaTek Dimensity కలిగి ఉండనుంది. 50MP (Main) + 8MP (UW) తో ప్రధాన కెమెరా రానుండగా, సెల్పీల కోసం 16MP Front Camera అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ 8000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. 80W (Wired) + 27W (Reverse Wired) ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. Android 16, OxygenOS 16 సిస్టంపై ఈ ఫోన్ వర్క్ చేయనుంది.






