గురుకుల విద్యార్థులకు మెరుగైన వసతులు : మంత్రి అడ్లూరి

by Muthe.Rajitha |

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

గురుకుల విద్యార్థులకు మెరుగైన వసతులు : మంత్రి అడ్లూరి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో నిర్మించిన నూతన మినీ బ్లాక్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురుకులాలను దేశంలోనే ఆదర్శ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు మౌలిక సదుపాయాలను దశలవారీగా విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నూతన భవనం వల్ల విద్యా, పరిపాలనా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story