భారీగా వసూలు చేసిన 'పెళ్లి సందడి'.. త్వరలో స్మాల్ స్క్రీన్‌పైకి

by Disha Web |
భారీగా వసూలు చేసిన పెళ్లి సందడి.. త్వరలో స్మాల్ స్క్రీన్‌పైకి
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందడి. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోష‌న్ హీరోగా, శ్రీ‌లీల హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా విమర్శలకు గురి కావడమే కాకుండా, బ్యాడ్ రివ్యూలను కూడా మూటకట్టుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించింది. రంగురంగుల పాటలతో పాటు రోషన్, శ్రీ లీల జంట గ్లామర్ డోస్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది.

చాలా రోజుల తర్వాత పెళ్లి సందడి నిర్మాతలు ఈ చిత్రం యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ ధరకు అమ్మేశారు. అయితే పెళ్లి సందడి నాన్-థియేట్రికల్ రైట్స్ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో సహా దాదాపు రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రసార హక్కులను జీ 5 కొనుగోలు చేసింది. సరైన ప్రమోషన్లు లేక ఫేల్ అయినప్పటికీ ఈ చిత్రం టిక్కెట్లు విషయంలో మాత్రం ట్రెండ్ క్రియేట్ చేసింది. మొత్తం మీద ఈ సినిమాతో నిర్మాతలు భారీ లాభాలనే ఆర్జించారు. కాగా ఈ సినిమా స్మాల్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో వేచి చూడాలి.



Next Story