రికార్డ్ బ్రేకింగ్ పోలింగ్.. మధ్యాహ్నం 1 గంటకు 61.11% ఓటింగ్ నమోదు

by Malleboina Mahesh |

బెంగాల్ తుది దశ పోలింగ్‌లో ఓటర్ల ఉత్సాహం! 1 గంటకే 61.11% పోలింగ్ నమోదు. హుగ్లీ జిల్లా 64.57%తో టాప్.

రికార్డ్ బ్రేకింగ్ పోలింగ్.. మధ్యాహ్నం 1 గంటకు 61.11% ఓటింగ్ నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ పండగ వాతావరణంలో కొనసాగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటేయడానికి క్యూ కట్టారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. దీంతో రికార్టు బ్రేకింగ్ పోలింగ్ శాతం నమోదవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లుగా మధ్యాహ్నం సమయానికి రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.

దీంతో మధ్యాహ్నం 1 గంట సమయానికి 61.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ముఖ్యంగా మహిళలు, యువ ఓటర్లు భారీ క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకు 18. 39, అలాగే 11 గంటలకు 39.97 శాతం నమోదైంది. ఇదే ఉత్సాహం కొనసాగితే మొదటి విడతలో నమోదైన 92.35 శాతం రికార్డును ఈ దశలో అధిగమించే అవకాశం కనిపిస్తోంది.

జిల్లాల వారీగా పరిశీలిస్తే, హుగ్లీ (Hooghly) జిల్లా అత్యధికంగా 64.57 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత హౌరా (60.68%), నదియా (61.41%) జిల్లాలు కూడా భారీ ఓటింగ్‌ను నమోదు చేస్తున్నాయి. కోల్‌కతా నార్త్‌లో 60.18 శాతం, సౌత్ కోల్‌కతాలో 57.73 శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు, ఈవీఎంలపై స్టిక్కర్ల వివాదాలు తలెత్తినప్పటికీ, భద్రతా బలగాల పహారాలో ఓటింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

Next Story