- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక.. అమిత్ షా, మోహన్ చరణ్ మాఝీలకు బాధ్యతలు!
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక కోసం అమిత్ షా, మోహన్ చరణ్ మాఝీలను పర్యవేక్షకులుగా అధిష్టానం నియమించింది. వీరి పర్యవేక్షణలో కొత్త సీఎం ఎవరనేది ఖరారు కానుంది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ (BJP) కీలక అడుగు వేస్తుంది. ఈ మేరకు శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)ను సెంట్రల్ సూపర్‌వైజర్‌గా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. అమిత్ షా తో పాటు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi)ని కూడా ఈ బాధ్యతలకు సహాయకులుగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఇద్దరు అగ్రనేతలు త్వరలోనే కోల్‌కతా చేరుకుని, కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. మే 9 న జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే శాసనసభాపక్ష నేతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఈ పర్యవేక్షకుల ప్రధాన లక్ష్యం. బెంగాల్‌లో పార్టీని అధికార తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఎంపిక జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.






