Sankranti: సరదాగా కైట్ ఎగరేస్తున్నారా.. కలిగే బెనిఫిట్స్ ఇదిగో..?

by Kodari Anjali |

సంక్రాతి(Sankranti) పండగొస్తే చాలు ఆడవాళ్లంతా పిండివంటలు, ముగ్గులతో బిజీబిజీగా గడిపేస్తుంటారు.

Sankranti: సరదాగా కైట్ ఎగరేస్తున్నారా.. కలిగే బెనిఫిట్స్ ఇదిగో..?
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాతి(Sankranti) పండగొస్తే చాలు ఆడవాళ్లంతా పిండివంటలు, ముగ్గులతో బిజీబిజీగా గడిపేస్తుంటారు. అలాగే పిల్లలు సరదాగా గాలిపటాలు తయారు చేసుకుని ఎగరేస్తుంటారు. పిల్లలంతా ఒకరికి ఒకరు పోటీ పడీ మరీ గాలిపటాలు ఎగరేస్తుంటారు. అయితే పతంగులు ఎగరేయడమంటే.. చాలా మంది జస్ట్ ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు. కానీ సంతోషంతో పాటు అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పతంగులు ఎగిరేయడం వల్ల మైండ్ కు రిలాక్సింగ్‌గా ఉంటుంది. గాలిపటం పైకి ఎగిరేసేటప్పుడు మీకు తెలియకుండానే టెన్షన్లు, బాధలు దూరమవుతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ప్రకృతి(nature)ని, గాలిని ఆస్వాదిస్తారు. ఇవన్నీ కూడా మీలో స్ట్రెస్‌ను తగ్గించి.. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

అంతేకాకుండా గాలిపటాలు ఎగిరేస్తే బాడీ కంప్లీట్‌గా చలించడానికి మేలు చేస్తుంది. పతంగి ఎగిరేసేటప్పుడు త్వరత్వరగా అడుగులు వేయడం, పరిగెత్తడం వంటివి చేస్తారు. కాగా బాడీలో కండరాల శక్తి(Muscle power) పెరుగుతుంది. అంతేకాకుండా శరీర స్థితిని మెరుగుపరుస్తుంది. తద్వారా శారీరక వ్యాయామంను అందించి.. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

గాలిపటం మీరు అనుకున్నంత ఎత్తుకు ఎగిరేసేటప్పుడు మీలో మీకు నమ్మకం(trust) కలుగుతుంది. ఆనందంతో పాటు మీపై నమ్మకం పెంచుతుంది. మానసికంగా స్ట్రాంగ్ గా అవుతారు. పలు సార్లు ఓటమి చవిచూసిచూసినప్పటికీ తిరిగి పుంజుకోవచ్చనే నమ్మకాన్ని కలిగించే ఆటే గాలిపటాలు ఎగరవేయడం.

మరోవైపు గాలిపటాలు ఎగరేయడం ద్వారా కుటుంబీకుల(family)తో, స్నేహితుల(friends)తో కలిసి సరదాగా సమయం గడిపే అవకాశం దక్కుతుంది. దీంతో సామాజిక సంబంధాలు బలపడుతాయి. కోఆర్డినేషన్ లెవల్స్ మెరుగుపడుతాయి. గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఫోకస్ మొత్తం దానిపైనే పెడతారు కాబట్టి.. శరీర మేధో సమన్వయం పెరుగుతుంది.

వీటితో పాటుగా పతంగి ఎగిరేసేటప్పుడు మీరు ఎక్కువగా శ్వాస తీసుకుంటారు. తద్వారా లంగ్స్ సామర్థ్యం(Lung capacity) మెరుగుపడుతుంది. సహనాన్ని పెంచుతుంది. సాధనా శక్తి(Instrumental power), విజయం సాధించినందుకు ఆనందాన్ని, సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తుంది.

Next Story