నల్ల జీలకర్ర ఉంటే అమ్మాయిలకు పండుగే!

by Disha Web Desk |
నల్ల జీలకర్ర ఉంటే అమ్మాయిలకు పండుగే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆధునిక యుగంలో సౌందర్యానికి పెద్దపీట వేస్తోంది యువత. ముఖ్యంగా మగువలు అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గ్లామర్ కనిపించేందుకు విపణిలోకి విరివిగా లభించే ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్‌లు, ఫేస్ వాష్‌లు, మ్యాచురైజర్లను ఇష్టానూసారంగా వాడేస్తున్నారు. వాటి వల్ల ప్రస్తుతానికి అందంగా కనిపించినా.. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాస్మోటిక్స్‌ల్లో కెమికల్స్, లిక్విడ్స్ విరివిగా ఉండటం వల్ల వాటిని వాడితే చర్మం మీద రంద్రాలు పడటం, మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మ వ్యాధులు రావడంతో పాటు కేన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే వీటన్నీటికి దూరంగా ఉంటూనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని సహజ సిద్ధమైన పదార్ధాలు ఎన్నో మన ఇంట్లోనే ఉంటాయి. మనం నిత్యం వాడుకునే వాటితోనే అందంతోపాటు ఆరోగ్యంగానూ ఉండొచ్చు. సహజ సిద్ధంగా దొరికే వీటి వల్ల చర్మం కాంతివంతంగా మారడంతోపాటు ఎంతో సౌందర్యంగా కనిపిస్తారు. వంటల్లో వాడే పదార్ధాల్లో అద్భుతమైన ఔషధ, గుణాలను కలిగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే వారెవ్వా అనాల్సిందే. అందులో నల్లజీలకర్ర గురించి మనం ప్రతేకంగా చెప్పుకోవాల్సిందే. సుగంధ ద్రవ్యాల్లో నల్లజీలకర్ర కొంచెం చేదుగా ఉంటుంది. అయినప్పటికీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇది కేవలం సువాసనకే పరిమితం కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీనిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం..



ముఖానికి నల్లజీలకర్ర ఆయిల్

నల్లజీలకర్ర నూనెను కొద్దిగా ఆలీవ్ నూనెతో కలిపిఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే అద్భుతమైయిన ఫలితం ఉంటుంది. మొటిమలు తగ్గించడమే కాకుండా నిగనిగలాడే చర్మాన్ని మీ సొంతం చేస్కోవచ్చు. ఈ రెండు నూనెల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడకు దివ్య ఔషధం

వెచ్చని నీరులో, తేనేతో కలిపి నల్లజీలకర్ర విత్తనాలను కషాయంగా తీసుకుంటే దగ్గు, జలుబు నయమవుతాయి. ఒక పలుచని బట్టలో కొన్ని నల్లజీలకర్ర గింజలను వేసి చుట్టి వాటిని నలిపి వాసన చూడటం ద్వారా జలుబు, ముక్కులో అడ్డుపడే శ్లేష్మం పెరుగుదల నుండి ఉపషమనం లభిస్తుంది.

జుట్టు రాలకుండా ఉండాలంటే..

కొబ్బరి నూనె, నల్లజీలకర్ర నూనె కలిపి ఈ మిశ్రమాన్ని వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు, స్కాల్ప్ ను మసాజ్ చేసి అరగంట తర్వాత జుట్టును హెర్బల్ షాంపుతో కడగాలి. ఈ నూనె జుట్టు కుదుళ్లను గట్టి పరిచి,వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది. అప్పుడప్పుడు ఆముదంతో కలిపి జుట్టుకి రాసుకున్న అద్భుతంగా పనిచేస్తుంది.




గుండె, కాలేయం జబ్బులకు..

ఈ గింజల అనామ్లజనీత లక్షణాలు కాలేయానికి తగిన మేలు చేస్తాయి. గాయం ప్రభావాన్నీ తగ్గించడానికి ఇన్ఫెక్షన్లను నిరోదించడానికి ఉపయోగ పడుతుంది. ఈ విత్తనాలను తినటం వల్ల రక్త కొలేస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నల్లజీలకర్ర నూనెతో కీళ్ల పై మసాజ్ చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపషమనం లభిస్తుంది. శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరిగిపోతుంది. అందుకే రెగ్యులర్‌గా నల్లజీలకర్రను రాత్రి నానబెట్టి, పొద్దున పొడిగా చేసుకొని నీళ్ళల్లో కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మీరు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.



Next Story