- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిథిలావస్థలో బెజ్జూర్ ఎంఆర్సీ భవనం
బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2003 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు. దాదాపు 23 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న ఈ కార్యాలయ భవనాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనానికి కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ఎప్పుడు కూలిపోతుందోననే ఆందోళన నెలకొంది. కార్యాలయ భవనం స్లాబ్ మొత్తం పగుళ్లతో ప్రమాదకరంగా మారింది. దీంతో కార్యాలయంలోని ముఖ్యమైన రికార్డులు వర్షపు నీటికి తడిసి దెబ్బతినే ప్రమాదం కూడా ఏర్పడింది. 23 సంవత్సరాలు గడిచినా భవనానికి కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో కార్యాలయానికి వచ్చే అధికారులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. అందువల్ల బెజ్జూర్ మండల కేంద్రంలో వెంటనే నూతన ఎంఆర్సీ భవనాన్ని నిర్మించాలని మండల ప్రజలు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎంఈఓ ఏమంటున్నారంటే…
ఈ విషయమై బెజ్జూర్ ఎంఈఓ డాక్టర్ సునీతను సంప్రదించగా, బెజ్జూర్ ఎంఆర్సీ భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.






