శిథిలావస్థలో బెజ్జూర్ ఎంపీడీవో కార్యాలయం

by Batti.Sumithra |

బెజ్జూర్ మండల ఎంపీడీవో కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వం 2001 సంవత్సరంలో ఈ కార్యాలయ భవనాన్ని నిర్మించింది.

శిథిలావస్థలో బెజ్జూర్ ఎంపీడీవో కార్యాలయం
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండల ఎంపీడీవో కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వం 2001 సంవత్సరంలో ఈ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. అయితే, నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు తగిన మరమ్మతులు చేపట్టకపోవడంతో భవనం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితికి చేరింది. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా కార్యాలయ భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు పైకప్పు కూలిపోతుందోననే ఆందోళనతో ప్రాణభయంతో విధులు నిర్వర్తిస్తున్నామని వారు చెబుతున్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఎంపీడీవో కార్యాలయ భవనానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరిందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఉద్యోగుల భద్రతతో పాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story