- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణితో సత్వర సమస్యల పరిష్కారం
జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

దిశ, కార్వాన్ : జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. గోల్కొండ జోన్ జోనల్ కమిషనర్ పి. ఉదయ్ కుమార్, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సమీక్షించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి ద్వారా నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ జోన్ జాయింట్ కమిషనర్ శ్రీహరి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్, జీహెచ్‌ఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






