- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
600 మంది విద్యార్థులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ
ప్రకృతి విపత్తులు, భారీ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు యంత్రాంగం చేరుకునేలోపు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో శిక్షణ పొందిన వాలంటీర్ల పాత్ర కీలకమని తెలంగాణ అగ్నిమాపక శాఖ గుర్తించి ఇందులో భాగంగా విద్యార్థులను ఫస్ట్ రెస్పాండర్స్ గా తీర్చిదిద్దేందుకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది..

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి విపత్తులు, భారీ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు యంత్రాంగం చేరుకునేలోపు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో శిక్షణ పొందిన వాలంటీర్ల పాత్ర కీలకమని తెలంగాణ అగ్నిమాపక శాఖ గుర్తించి ఇందులో భాగంగా విద్యార్థులను ఫస్ట్ రెస్పాండర్స్ గా తీర్చిదిద్దేందుకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రత్యేక శిబిరాలు ప్రారంభించారు.ఈ శిక్షణ కార్యక్రమాలపై అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో విపత్తు సంసిద్ధతను బలోపేతం చేయడమే మా లక్ష్యం. వరదలు, అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్ వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ వాలంటీర్లు సమర్థవంతంగా పనిచేస్తారు అని తెలిపారు.
మల్లారెడ్డి వర్సిటీలో 400 మందికి శిక్షణ..
మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి. రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా విద్యార్థులు ఇలాంటి శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 400 మంది వాలంటీర్లు అత్యవసర పరిస్థితుల నిర్వహణపై శిక్షణ పొందుతున్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారులు డీఎఫ్‌వోలు వి. శ్రీనివాస్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మహిళా వర్సిటీలో రెండో బ్యాచ్.. హైదరాబాద్ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో 200 మంది వాలంటీర్లతో రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభమైంది. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విపత్తుల సమయంలో మహిళా వాలంటీర్లు ధైర్యంగా ముందుండి బాధితులకు అండగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్ డీఎఫ్‌వో టి. వెంకన్న ఆధ్వర్యంలో ఈ శిక్షణ పొందుతున్నారు.
ఐదు రోజుల పాటు వాలంటీర్లకు శిక్షణ...
భవనాలపై నుంచి బాధితులను రక్షించే విధానం రెస్క్యూ ఆపరేషన్లు. ప్రాథమిక అగ్నిమాపక పద్ధతులు,గాయపడిన వారికి అందించే ప్రథమ చికిత్స,తొక్కిసలాట వంటి సమయాల్లో జనసమూహ నియంత్రణ. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని, అవసరమైనప్పుడు వారి సేవలను వినియోగించుకుంటామని అధికారులు వెల్లడించారు.






