కొత్త కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన BOI

by Malleboina Mahesh |

బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ‘Omni Neo Biz’ ప్రారంభం.. పాత సేవలు త్వరలోనే బంద్.. కస్టమర్లు త్వరగా రిజిస్టర్ చేసుకోండి.

కొత్త కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన BOI
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' (Bank of India - BOI) తన కార్పొరేట్ కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కష్టమర్ల డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత వేగవంతం, సులభతరం చేస్తూ సరికొత్త ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘ఓమ్ని నియో బిజ్’ (Omni Neo Biz) పేరుతో సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ సరికొత్త కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో లైవ్‌లోకి వచ్చినట్లు బ్యాంక్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

పాత ప్లాట్‌ఫారమ్ త్వరలోనే బంద్ - రిజిస్ట్రేషన్ తప్పనిసరి

కార్పొరేట్ కస్టమర్లు ఎటువంటి అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా పొందేందుకు వీలుగా తక్షణమే ఈ కొత్త 'Omni Neo Biz' ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని బ్యాంక్ కోరింది. ఇందుకోసం కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అందులోని ‘ఇంటర్నెట్ బ్యాంకింగ్’ సెక్షన్ ద్వారా సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాత కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను (Old corporate Internet banking) త్వరలోనే పూర్తిగా నిలిపి వేయనున్నట్లు (Discontinued) బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పుకు సంబంధించి కస్టమర్లకు ఎలాంటి సందేహాలు, సాంకేతిక సమస్యలు ఎదురైనా, తమ సమీప బ్యాంక్ శాఖను గానీ, బ్యాంక్ ఉచిత హెల్ప్‌లైన్ నెంబర్ 18001031906 ను గానీ సంప్రదించవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటనలో పేర్కొంది.

Next Story