జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు

by Malleboina Mahesh |

జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రేసులోకి వైభవ్ సూర్యవంశీ!

జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 23 నుంచి జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటనించింది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సోమవారం రాత్రి బలమైన భారత జట్టును అనౌన్స్ చేసింది. సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఈ 15 మంది సభ్యుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తెలుగు యువ సంచలనం తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. జూలై 23 నుండి జూలై 26 వరకు హరారే వేదికగా ఈ మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

నితీష్ కుమార్ రెడ్డి అవుట్

ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బీహార్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి మరోసారి సీనియర్ భారత జట్టులో అవకాశం దక్కింది. అతనితో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించిన సూర్యాంశ్ శెడ్గే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్‌లకు కూడా సెలక్టర్లు మొగ్గు చూపారు. కాగా, ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ జట్టులో ఒక మార్పు జరిగింది. గాయం కారణంగా దూరం కావడంతో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఆల్‌రౌండర్ శివం దూబేను వన్డే జట్టులోకి రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.

జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాంశ్ శెడ్గే, రింకు సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

Next Story