త్వరలో కొత్త పెన్షన్లు

by Taduka Kalyani |

కొత్త పెన్షన్లు త్వరలో ఇవ్వనున్నట్లు రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

త్వరలో కొత్త పెన్షన్లు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కొత్త పెన్షన్లు త్వరలో ఇవ్వనున్నట్లు రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ కే హైమావతి, ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పేరిట రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్ల వడ్డీ కడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఒక్క పెంకుటిల్లు ఉండొద్దు అనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి పేరు వస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు, జీరో కరెంటు బిల్, సన్న బియ్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నందు వల్లే తులం బంగారం పథకం ఇవ్వడానికి లేట్ అవుతుందన్నారు. జర్మనీలో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. యువత కు టాం కామ్ సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి జర్మనీ లాంగ్వేజ్ నేర్పిచ్చి ఉచితంగా విదేశాలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి పూజలు హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం, ఆత్మ కమిటీ నియోజక వర్గ చైర్మన్ పూజల గోపికృష్ణ, నంగునూరు ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరకుల శివప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story