- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోలార్ కంపెనీని సందర్శించిన డీసీపీ యోగేష్ గౌతమ్
by Taduka Kalyani |
షాబాద్ మండల పరిధిలోని నూతన సోలార్ కంపెనీని డీసీపీ యోగేష్ గౌతమ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు

X
దిశ, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని నూతన సోలార్ కంపెనీని డీసీపీ యోగేష్ గౌతమ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 9న జరగనున్న కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు బందోబస్తు, ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీసీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Next Story






