మండే ఎండల్లో మందుబాబులకు చల్లని వార్త

by Muthe.Rajitha |   (  Updated:2026-05-19 04:10:39  IST  )

తీవ్రమైన ఎండల వేళ చల్లని బీర్ తాగాలనుకునే మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం ఒక ఊహించని శుభవార్త చెప్పింది.

మండే ఎండల్లో మందుబాబులకు చల్లని వార్త
X

దిశ, వెబ్ డెస్క్ : తీవ్రమైన ఎండల వేళ చల్లని బీర్ తాగాలనుకునే మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం ఒక ఊహించని శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త ఎక్సైజ్ పన్ను విధానం (New Excise Policy) కారణంగా అక్కడ బీర్ల ధరలు భారీగా తగ్గాయి. వివిధ రకాల బ్రాండ్లపై కనిష్టంగా రూ.20 నుండి గరిష్టంగా రూ.75 వరకు ధరలు దిగిరావడంతో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త పన్ను విధానం వల్ల అత్యంత ప్రజాదరణ పొందిన 'కింగ్‌ఫిషర్' బీర్ ధర గతంలో ఉన్న రూ.185 నుండి ఏకంగా రూ.110 కి పడిపోవడం విశేషం. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి మద్యం ప్రియులకు వరంగా మారడమే కాకుండా.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని వారికి కూడా తక్కువ ధరకే బీర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో 26 వరకు హై అలర్ట్

Next Story