పాకిస్థాన్ రెచ్చగొడుతోంది : బీసీసీఐ

by Muthe.Rajitha |

పాకిస్థాన్ బంగ్లాదేశ్‌ను తప్పుదోవ పట్టిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.

పాకిస్థాన్ రెచ్చగొడుతోంది : బీసీసీఐ
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ బంగ్లాదేశ్‌ను తప్పుదోవ పట్టిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. టీ20 ప్రపంచ కప్‌ 2026 విషయంలో పాకిస్థాన్‌ కావాలనే బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతోందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మండిపడ్డారు. భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ ఆడాలని తాము కోరామని, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కొలంబోలో మాత్రమే మ్యాచ్‌లు ఆడతామని బంగ్లాదేశ్‌ పట్టుబట్టిందని పేర్కొన్నారు. చివరి నిమిషంలో షెడ్యూల్‌ మార్చడం కుదరక, స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ అనవసరంగా జోక్యం చేసుకుని బంగ్లాను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. టీ20 ప్రపంచ కప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.

Next Story