బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. వారికి ఊహించని ప్రమోషన్!

by Malleboina Mahesh |

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. ఈ కొత్త కాంట్రాక్ట్.. 2025 అక్టోబర్ 1 నుండి 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. వారికి ఊహించని ప్రమోషన్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. ఈ కొత్త కాంట్రాక్ట్.. 2025 అక్టోబర్ 1 నుండి 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. ఇందులో బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకొని, సీనియర్ ప్లేయర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. అత్యున్నత కేటగిరీ అయిన Grade A+ ను రద్దు చేసింది. గతంలో ఈ కేటగిరీలో ఉండి రూ. 7 కోట్లు అందుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇప్పుడు ఏకంగా Grade B కి పడిపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం కావడమే దీనికి ప్రధాన కారణం.

టాప్ గ్రేడ్‌లో ముగ్గురే: అత్యున్నత కేటగిరీ అయిన Grade A+ ను రద్దు చేసిన తర్వాత.. Grade A నే అత్యున్నత కేటగిరీగా ఉంది. ఇందులో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. జస్ ప్రీత్ బుమ్రా (అన్ని ఫార్మాట్లలో కీలక బౌలర్), రవీంద్ర జడేజా (సీనియర్ ఆల్ రౌండర్) శుభ్‌మన్ గిల్ టీమిండియా కొత్త టెస్ట్, వన్డే కెప్టెన్ కావడంతో గ్రేడ్ బి నుండి ఏ కి ప్రమోట్ అయ్యాడు.

మహిళా జట్టులో జెమిమా రోడ్రిగ్స్ హవా: తాజా వార్షిక కాంట్రాక్టుల ప్రకటనలో మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ భారీ లాభం పొందింది. 2025 ప్రపంచకప్‌లో ఆమె కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా బీసీసీఐ ఆమెను Grade A కి ప్రమోట్ చేసింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలు టాప్ గ్రేడ్‌లో కొనసాగుతున్నారు.

Grade B లో వార్షిక వేతనం రూ. 30 లక్షలు అందుకునే వారిలో జట్టులో రెగ్యులర్‌గా ఆడుతున్న కీలక ప్లేయర్లు షఫాలీ వర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, యస్తికా భాటియా, ఉన్నారు.

Grade C వార్షిక వేతనం రూ. 10 లక్షలు: అందుకునే వారిలో యువ క్రీడాకారిణులు, కొత్తగా జట్టులోకి వచ్చిన శ్రేయాంక పాటిల్ (కీలక స్పిన్నర్), రాధా యాదవ్, మీనాక్షి సింగ్, ప్రియా పునియా, హేమలత, అరుంధతి రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే పురుషుల జట్టులో A+ ను రద్దు చేయడంతో ప్రస్తుతం A, B, C మూడు కేటగిరిలే ఉన్నాయి. ఇందులో ఏ కేటగిరి (రూ. 5 కోట్లు)లో బుమ్రా, రవీంద్ర జడేజా, శుభ్ మాన్ గిల్ ఉన్నారు.

బీ కేటగిరీ (రూ. 3 కోట్లు): కోహ్లీ, రోహిత్, పంత్, హార్దిక్, రాహుల్, సిరాజ్, కుల్దీప్, జైస్వాల్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

సీ కేటగిరీ (రూ. 1 కోటీ): అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ (కొత్తగా చేరారు), రవి బిష్ణోయ్ లు ఉన్నారు.

Next Story