గోవా నేవీ స్పోర్ట్స్ స్కూల్‌కు బీసీ గురుకుల విద్యార్థులు

by Muthe.Rajitha |

గోవాలోని ప్రతిష్టాత్మక నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలకు చెందిన నలుగురు విద్యార్థులు సత్తా చాటారు.

గోవా నేవీ స్పోర్ట్స్ స్కూల్‌కు బీసీ గురుకుల విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోవాలోని ప్రతిష్టాత్మక నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలకు చెందిన నలుగురు విద్యార్థులు సత్తా చాటారు. ఈ మేరకు బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం క్రీడారంగానికి ఇస్తున్న ప్రోత్సాహంతోనే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, వసతితో పాటు ప్రత్యేక క్రీడా అంశాలలో శిక్షణ ఇస్తారని, చదువు పూర్తికాగానే నేవీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గోవా నేవీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికైన విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి అభినందించారు.

ఎంపికైన విద్యార్థులు..

జె.ధనుష్ (పదో తరగతి) – శామీర్ పేట, హైదరాబాద్ జిల్లా

జి.శివ రాజ్ (ఎనిమిదో తరగతి) – శామీర్ పేట, హైదరాబాద్ జిల్లా

డి. కౌనిక్ వర్ధన్ (తొమ్మిదో తరగతి) – కమలాపూర్, వరంగల్ జిల్లా

యమ్. అరవింద్ (తొమ్మిదో తరగతి) – ధర్మారం, నిజామాబాద్ జిల్లా

Next Story