బ్రెయిన్ స్ట్రోక్‌తో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి

by Jakkula.Mamatha |

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బి గంగారం 15వ బెటాలియన్‌లో శనివారం చోటుచేసుకుంది.

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి
X

దిశ,సత్తుపల్లి: బ్రెయిన్ స్ట్రోక్‌తో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బి గంగారం 15వ బెటాలియన్‌లో శనివారం చోటుచేసుకుంది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం భీముని గూడెం గ్రామానికి చెందిన తాటి నాగార్జున(39) గత కొంతకాలంగా బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా ఈ నేల జూన్ 2వ తేదీ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెటాలియన్ ఉద్యోగులు హుటాహుటిన ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున ఈ రోజు(శనివారం) ఉదయం మృతి చెందారు. నాగార్జున మృతి పట్ల బెటాలియన్ కమాండెంట్, ఆఫీస్ ఉద్యోగులు, బెటాలియన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య విజయ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగార్జున మృతితో భీముని గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story