- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమెన్ సేఫ్టీ వింగ్ స్పెషల్ ప్రాజెక్ట్.. స్త్రీ రైడ్ ను ప్రారంభించిన డీజీపీ సి.వి. ఆనంద్
రాష్ట్రంలో మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా తెలంగాణ పోలీసుల ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా చేపట్టిన ప్రాజెక్ట్ స్త్రీ రైడ్.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా తెలంగాణ పోలీసుల ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా చేపట్టిన ప్రాజెక్ట్ స్త్రీ రైడ్. ఈ కార్యక్రమాన్ని డీజీపీ సి.వి.ఆనంద్ శనివారం ప్రారంభించారు. తొలివిడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా ఛాన్స్ ఇచ్చారు. వీరికి అంబర్ పేట్ పోలీస్ లైన్లో టూ వీలర్, త్రీ వీలర్ డ్రైవింగ్ నైపుణ్యాల్లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలందరికీ డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళలకు స్వయంగా ఉపాధిని అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఇతర మహిళలకు సురక్షితమైన రవాణా సేవలు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. అలాగే మహిళలు అన్నిరంగాల్లో ముందుకురావాలని కోరారు. పోలీస్ శాఖలోనూ మహిళలు మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మహిళలు ఎస్ హెచ్ఓ పోస్టులు చేపట్టాలని తెలిపారు. మహిళలు ఎదగాలంటే వారి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా నాయకత్వ స్థానాల్లోకి రావాలంటే ఇంట్లో ఉన్న పురుషుల మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకమని డీజీపీ తెలిపారు. మహిళల సాధికారతకు కుటుంబ మద్దతును పెంచే ఉద్దేశంతో ‘Stand With Her’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్నారు.






