Bank Of Baroda: ఎంసీఎల్ఆర్ రేటును పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా

by Dishanational2 |
Bank Of Baroda: ఎంసీఎల్ఆర్ రేటును పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) అన్ని కాలవ్యవధి రుణాలపై 0.05 శాతం పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. మంగళవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం, బ్యాంక్‌ రుణ రేటు ఏడాది కాలవ్యవధిపై 7.35 శాతానికి పెరుగుతుంది. అలాగే, నెలకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు 6.95 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.10 శాతం, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.20 శాతానికి పెరగనున్నాయి. రుణాలు తీసుకునేందుకు బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుంటాయి. ఖాతాదారులు తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు ఆధారంగానే బ్యాంకులు ఇస్తాయి.


Next Story

Most Viewed