తన వెంటపడొద్దని రూ. 2 లక్షలిచ్చింది.. అయినా అతను..

by Dishanational1 |
తన వెంటపడొద్దని రూ. 2 లక్షలిచ్చింది.. అయినా అతను..
X

దిశ, వెబ్ డెస్క్: తనపాటు బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు.. అదంతా వేడియో తీశాడు. దానితో బెదిరించి రూ. లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు కావాలనడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఓ బ్యాంకులో మహిళా ఉద్యోగి తనపాటు పనిచేస్తున్న ఓ వ్యక్తిని బర్త్ డే పార్టీకి పిలిచింది. అయితే, అతను ఆమె తాగుతున్న కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. అనంతరం ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదంతా కూడా వీడియో తీశాడు. ఆ వీడియోతో తన డబ్బులు కావాలంటూ బెదిరించాడు. దీంతో ఆమె అతడికి రూ. 2 లక్షలు ఇచ్చింది. అయినా కూడా అతను ఇంకా డబ్బులు కావాలని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో బ్యాంకులో పని చేసే మిగతా స్టాఫ్ కు కూడా ఆ వీడియోను సెండ్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Next Story