- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేపర్ ప్లేటులో బ్యాంక్ పత్రాలు ప్రత్యక్షం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
సోషల్ మీడియా యుగంలో అన్ని పనులు సులువైపోతున్నా, డేటా ప్రైవసీకి మాత్రం భద్రత కరువైంది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media) యుగంలో అన్ని పనులు సులువైపోతున్నా, డేటా ప్రైవసీ (Data Privacy)కి మాత్రం భద్రత కరువైంది. ఈ ఉదంతానికి అద్దం పట్టేలా ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మోరన్ హ్యూమర్ (Moranhumor) అనే ‘X’ (ట్విట్టర్) యూజర్ రోడ్డు పక్కన ఉన్న చాట్ బండి వద్దకు వెళ్లాడు. సదరు వ్యాపారి అతడికి చాట్ వేసి ఇచ్చిన పేపర్ ప్లేటును చూసి అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ ప్లేటును ఒక ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్ డాక్యుమెంట్‌తో తయారు చేసినట్లుగా అతడు గుర్తించాడు. అందులో కస్టమర్ పేరు, అడ్రస్, పేమెంట్స్ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. కొన్ని చోట్ల పెన్నుతో కొట్టివేతలు ఉన్నప్పటికీ, ఆ వివరాలన్నీ సులభంగా చదవగలిగేలా ఉన్నాయి. అనంతరం ‘భారతదేశంలో మీ డేటా గోప్యత మీ చేతుల్లో కూడా లేదు.. అది వీధి వ్యాపారి చేతిలో ఉంది’ అని ఆ ట్విట్టర్ యూజర్ వ్యంగ్యంగా క్యాప్షన్‌ను జోడిస్తూ తన అకౌంట్‌లో షేర్ చేశాడు.
ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్లు బ్యాంకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్న పత్రాలను బ్యాంకులు ముక్కలు చేయకుండా, ఇలా పాత సామాన్ల కింద అమ్మేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ వివరాలను ఉపయోగించి ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






