మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు

by Disha Web Desk 17 |
మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు
X

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీకి పొరుగుదేశం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ గంగా మిషన్‌లో భాగంగా ఉక్రెయిన్ లోని భారతీయ పౌరులతో పాటు బంగ్లా విద్యార్థులను సురక్షితంగా ఎయిర్ లిఫ్ట్ చేసినందుకు బంగ్లా ప్రధాని ప్రధాని మోడీకి ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలిపారని గురువారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ మినహా ఏ దేశాలు తమ పౌరుల కోసం విమానాలను పంపించడం లేదు. ఇండియా మాత్రం ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతూనే ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేపడుతోంది. భారత్ ఇటీవల భారతీయులతో పాటు నేపాల్, టునీషియా విద్యార్థులను కూడా తీసుకొచ్చింది. అంతముందుకు పాకిస్తాన్‌కు చెందిన ఆస్మా షఫిక్‌ను సురక్షితంగా తరలించింది. దీంతో ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీకి ఆస్మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. కాగా, ఇప్పటివరకు 18 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు కేంద్రం ప్రకటించింది.




Next Story

Most Viewed