కాసేపట్లో చిరంజీవి సినిమా ప్రీమియర్స్.. బండ్ల గణేష్ కీలక ట్వీట్

by Gantepaka Srikanth |

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

కాసేపట్లో చిరంజీవి సినిమా ప్రీమియర్స్.. బండ్ల గణేష్ కీలక ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ రాత్రికే ప్రీమియర్స్ కూడా అనేక చోట్ల పడబోతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘మన తెలుగు సినిమాకు గర్వకారణమైన, మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ యాక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. దానికి మరింత ఆకర్షణగా విక్టరీ వెంకటేశ్ చమత్కారమైన హాస్యం యాడ్ కాబోతోంది. ఈ సంక్రాంతి పండుగ వేళ విడుదల కాబోతున్న ఈ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్’’ అని ట్వీట్‌లో బండ్ల గణేష్ పేర్కొన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story