పవన్ కల్యాణ్ ఒక్కడే చరిత్రను తుడిపేయగలడు: నిర్మాత

by Gantepaka Srikanth |

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది.

పవన్ కల్యాణ్ ఒక్కడే చరిత్రను తుడిపేయగలడు: నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో(Kenjutsu induction) అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని ఆయన సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “ఇండయన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదుతో సత్కారించింది. తాజాగా పవన్ కల్యాణ్‌కు దక్కిన ఈ అరుదైన గౌరవంపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘చరిత్రలు రాసేవాళ్లు చాలా మంది ఉంటారు.. కానీ చరిత్రనే తుడిచేసేవాడు ఒక్కడే.. ఆయనే పవన్ కల్యాణ్.. భారత మార్షల్ ఆర్ట్స్ పులి.. ఆయనకు గౌరవం దక్కడం అంటే.. తెలుగు వారందరికీ దక్కిన గౌరవం.. కంగ్రాట్స్ సార్’ అని ట్వీట్‌లో బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Next Story