పవన్ కళ్యాణ్‌కు షాక్.. BJPలోకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

by Dishanational2 |
పవన్ కళ్యాణ్‌కు షాక్..  BJPలోకి  టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్
X

దిశ, వెబ్‌డెస్క్ : నిర్మాత బండ్ల గణేష్ బీజేపీలోకి చేరుతున్నారని అప్పట్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈయన బీజేపీలోకి వెళ్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా బండ్ల గణేష్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో దిగిన ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. తన కొడుకులను, బీజేపీ ఎమ్మెల్యే ఈటల వద్దకు తీసుకెళ్లారు.. ఆయన బీజేపీలోకి వెళ్లడానికే సన్నద్ధం అవుతున్నారు అని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ఈటల రాజేందర్ తో ఫోటోలు దిగడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక త్వరలోనే ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికే అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇప్పుడు ఈటలను కలుస్తున్నారని కొందరు ముచ్చటిస్తున్నారు. కాగా, ఈయన 2018 సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్‌లలో బండ్ల గణేష్ ఒకరు.



Next Story

Most Viewed